నేడు మునుగోడు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 3 గంటలకు జరగనున్న ఈ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి చల్లారలేదు. ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో సభకు దూరంగా ఉండాలని పలువురు నేతలు నిర్ణయం తీసుకున్నారు. రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీతో మునుగోడు రాజకీయం మరింత హాట్‌గా మారింది.
మునుగోడులో ఆది నుంచి స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని వ్యతిరేకిస్తూ అసమ్మతిని వ్యక్తం చేస్తున్న నేతలు సీఎం సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సీఎం సభకు సంబంధించి జనసమీకరణ, ప్రణాళిక అంశాలు తమతో కనీసం చర్చించకపోవడం పైగా సభకు రావాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే నుంచి తమకు కనీస సమాచారం లేకపోవడంతోనే సభకు దూరంగా ఉండి పార్టీకి నిరసన తెలపాలని నిర్ణయించినట్లు మునుగోడు, నాంపల్లి జడ్పీటీసీలు, సంస్థాననారాయణపురం ఎంపీపీ, చౌటుప్పల్ మునిసిపల్ చైర్మన వెనరెడ్డి రాజు, రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్‌లు పార్టీ పెద్దలకు తెలిపినట్లు తెలిసింది.









