AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు మునుగోడులో సీఎం కేసీఆర్‌ సభ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలకు హాజరవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో భువనగిరిలో సీఎం సభ ముగియగా గురువారం మునుగోడులో జరగనుంది. సాయంత్రం మూడు గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత రూ.500కోట్లకు పైగా నిధులతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, డిండి ఎత్తిపోతల పథకం పూర్తికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం కేసీఆర్‌ ఈ సభలో వివరించనున్నారు. మరోవైపు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమని, కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు అవినీతి చేసిందని, సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమన్నారు. అధిష్టానం ఆదేశిస్తే మునుగోడుతో పాటు గజ్వేల్‌ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఆయనకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఘాటుగా స్పందించే అవకాశం ఉంది.

ANN TOP 10