రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం ముగిసింది. రాజమహేంద్రవరంలో లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీలో.. ప్రధానంగా 6 అంశాలపై చర్చించారు. దాదాపు రెండున్నర గంటలపాటు సమన్వయ కమిటీ సమావేశం కొనసాగింది. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, అవితీనిపై ఛార్జిషీట్, ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాట ప్రణాళికపై సమన్వయ కమిటీ చర్చించింది. ఓటరు తొలి ముసాయిదా ప్రకటనపై ఈనెల 27న సమన్వయ కమిటీ చర్చించనుంది. తదుపరి భేటీలు ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరపాలని కమిటీ నిర్ణయించింది.









