బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదని, నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయన్నారు. డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా, కోలాటమాడాలన్నా భయపడుతున్నారని అన్నారు. ఎందుకు అభద్రత భావంలో ఉన్నారో అర్ధం కావట్లేదన్నారు. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని, స్టేషన్ ఘనపూర్‌కు తానే సుప్రీం అని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.