AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని పచ్చి అబద్దాలకోరు.. మంత్రి కేటీఆర్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై నిజామాబాద్‌ బహిరంగసభలో చేసిన కామెంట్స్‌కు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్దాలని, అసత్యాలు మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని జూమ్లాలకు ప్రసిద్ది చెందిన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. ఇంటింటికి నీళ్ళు ఇస్తామని, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని..ప్రతీ ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చుతానని చెప్పిన అబద్ధాల ప్రచారకర్త మోదీ అని ఫైర్ అయ్యారు కేటీఆర్. బీజేపీతో పొత్తు పెట్టుకోని పార్టీలను బద్నాం చేయాలని అబద్దాలు చెప్పడం శోచనీయమన్నారు. అధికారిక సమావేశాన్ని నీచమైన రాజకీయాలకు వాడుకోవడం సరికాదని చురకలంటించారు.

మోదీ తన ప్రసంగంలో ప్రధానమంత్రి స్థాయిని తగ్గించేలా మాట్లాడారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం ఇంత నీచనికి దిగజారిన వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు.

ANN TOP 10