| సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార ఘట్టమనేని గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆమె తన వీడియోలతో పాటు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ..ఆయన కూతురు,గారాల పట్టి సితార ఘట్టమనేనిs కూడా అంతే… పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఓ వార్తల్లో మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అక్కడ తనకు తోచిన అంశాలపై ఆమె తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి చర్చిస్తుంది. అది అలా ఉంటే సితార మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆమెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మాత్రం వావ్ సితార.. అన్ని తండ్రి పోలికలే అంటూ కామెంట్స్ చేస్తూ.. పొగుడుతున్నారు. విషయంలోకి వస్తే.. ఆమె తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గోన్నారు.
ఓ అంతర్జాతీయ వ్యాపార సంస్థ హైదరాబాద్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు పెట్టింది. దీన్ని సితార ప్రారంభించింది. ఈ సందర్భంగా పిల్లలకు, వృద్ధులకు దసరా కానుకలను అందజేశారు. అయితే కొందరు వృద్ధులు ఆ మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ఉంటే.. సితార స్వయంగా వారిని చేతితో పట్టుకుని మెట్లు ఎక్కించింది. ఇక ఇది చూసిన నెటిజన్స్ సితార.. నీది ఎంత గొప్ప మనస్సు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అన్ని నాన్న పోలికలే వచ్చాయంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.









