అవును, హైదరాబాద్‌లో గణపతి లడ్డూ ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు సృష్టించింది. నగరంలోని బండ్లగూడలో వినాయకుడి లడ్డూ భారీ ధర పలికింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయిలో రూ.1.26కోట్లు పలికింది. ఇప్పటివరకు బాలాపూర్ గణేష్ లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికేది. గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.24.60లక్షల ధర పలికింది. ప్రస్తుతం బాలాపూర్ గణేష్ లడ్డూ ధరను బ్రేక్ చేస్తూ బండ్లగూడ వినాయకుడి లడ్డూ ధర రికార్డు స్థాయిలో రూ.1.26 కోట్లు పలికింది.









