AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసింది ఆ ముగ్గురే: సీపీఐ నారాయణ

తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఒక మాజీ ఉన్నత స్థాన న్యాయమూర్తి లకే దక్కుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఒంగోలులో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజా రాజకీయ స్థితిగతుల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాలకు తీవ్రంగా అన్యాయం చేసిన వారిలో మొదటి స్థానం ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి మోసం చేశారని, అందుకు ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు ప్రశ్నించకుండా తెలుగు రాష్ట్రానికి తనవంతుగా అన్యాయం చేశారని విమర్శించారు.

ఓవైపు బీజేపీతో ఉంటూ మరోవైపు టీడీపీతో దోస్తీ చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. రాజకీయ వైఖరి ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ఉందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలను శాసించే స్థాయికి చేరుకొని, కార్పొరేట్ వ్యవస్థకు వంత పాడుతుందని తెలిపారు. బీజేపీతో దోస్తీ చేసినంత కాలం జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవని తెలిపారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగా ప్రజా సంక్షేమం ఆధారపడి ఉంటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. బీజేపీ ఆడించినట్లుగా ఏపీలో వైసీపీ నడుచుకుంటోందని.. ప్రజా సంక్షేమం పేరిట ఏపీలో సీఎం జగన్ కార్పొరేట్ వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నారన్నారని నారాయణ విమర్శించారు.

ANN TOP 10