AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణకు ప్రధాని మోదీ.. టూర్ షెడ్యూల్ ఖరారు

ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని రాష్ట్ర టూర్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1న 1.30 గంటలకు ప్రధాని మోదీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మహబూబ్‌నగర్ వెళ్లనున్నారు. 3.15 నుంచి 4.15 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తిరిగి 5గంటల 05 నిమిషాలకు బేగంపేట చేరుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు.

ప్రధాని టూర్ కి సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ టూర్ లో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమరశంఖాన్ని పూరించనున్నట్టు సమాచారం.

ANN TOP 10