AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి..

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న జనాలపైకి మితిమీరిన వేగంతో వచ్చిన కారు దూసుకెళ్లడమే కాకుండా ఆ పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. జనం అంతా వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్‌లో నిలబడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మితిమీరిన వేగంతో దూసుకొని వచ్చిన కారు స్తంభాన్ని ఢీ కొట్టింది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ANN TOP 10