వినాయక నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలో ఉన్న చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయటానికి వీళ్లేదని ఆదేశాలు ఇచ్చింది. పీవోపీ విగ్రహాలను నగరంలో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.హైకోర్టు ఆదేశాలను యథాతదంగా అమలు చేయాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 18న గణేశ్ చతుర్థి రోజున మండపాల్లో కొలువుదీరిన గణనాథులకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు లక్ష మండపాటు ఏర్పాటు చేశారు. కాగా, నగరంలో ఇప్పటికే గణేశ్ నిమజ్జనాలు ఊపందుకున్నాయి. మూడో రోజు నుంచే నగరంలోని గణనాథులను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఈనెల 28న ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయకుడితో పాటు బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం జరగనుంది.
హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. హూస్నేన్ సాగర్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్‌తో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న చెరువుల్లో సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని పోలీసులు భావిస్తున్నారు. హుస్సేన్ సాగర్‌కు వచ్చే రహదారుల్లో యూటర్న్‌లు, వంతెనల ఎత్తులు, ఎత్తుల వారీగా విగ్రహాల అనుమతిపై సమీక్షించిన ఇప్పటికే సీపీ సమీక్షించారు. క్రేన్ల ఏర్పాట్లపై కూడా అధికారులతో చర్చించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం మట్టి వినాయకులను మాత్రమే నిమజ్జనం చేయాలని సూచించింది. అయితే ప్రతి ఏటా ఆవేవి అమలుకు నోచుకోవటం లేదనే దుష్ప్రచారం సాగుతోంది. మరి ఈసారైనా హైకోర్టు ఆదేశాలు పక్కాగా అమలవుతాయో లేదో వేచి చూడాలి.