AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి గుడ్‌ బై..

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పంపించారు. కొద్ది రోజులుగా మైనంపల్లి హన్మంతరావు పార్టీ అధిష్ఖానంపై అలకతో ఉన్నారు. తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్నారు. దీంతో మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. మైనంపల్లి మల్కాజ్‌గిరి, మెదక్ రెండు అసెంబ్లీ (ఎమ్మెల్యే) సీట్లు కోరుతున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయింది.

తనకు మాత్రమే టికెట్ఇచ్చి.. తన కొడుకుకు టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తన కొడుకుకు మెదక్ టికెట్ కోసం ఇప్పటికే చాలాసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.అయినప్పటికీ ఆయన నుంచి క్లారిటీ రాకపోవడతో కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య మంత్రి హరీష్‌రావుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

మైనంపల్లి మనసు ఎంపీ స్థానం వైపు మల్లడం వెనక పెద్ద కారణమే ఉంది. తాను ఎంపీగా పోటీచేసి… కుమారుడు మైనంపల్లి రోహిత్‌ను మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలనుకుంటున్నారు. దీనికోసం అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు. రోహిత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. లోకల్‌గా యూత్‌లో గ్రిప్‌ సంపాదించేలా.. ప్రచారం కూడా జోరుగానే చేస్తున్నారు.

ANN TOP 10