యాదాద్రి : అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం స్టేజి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. తొర్రూరు డిపోకు చెందిన బస్సు జగద్గిరిగుట్టకు వెళుతోంది. బొడ్డుగూడెం స్టేషన్ వద్దకు రాగానే బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులు చిన్నపడిశాల గ్రామానికి చెందిన యాకమ్మ(55), అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామకార్యదర్శి కొండ రాములు(59)గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని మృతుల బంధువులు, తోటి ప్రయాణికులు రోడ్డుపై బైఠాయించారు.









