AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు!

మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు..
మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉ‍న్న టాలీవుడ్ హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో ఇవాళ సోదాలు నిర్వహించింది. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలిసింది. తనను అరెస్టు చేయవద్దంటూ ఇప్పటికే నవదీప్ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇక ఈ కేసులో పోలీసులు రామ్‌చంద్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రామ్‌చంద్ ద్వారానే నవదీప్ డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు అభియోగాలు మోపారు. ఆయన్ను ఈ కేసులో 37వ నిందితుడిగా పేర్కొన్నారు. కాగా.. నవదీప్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.

గత నెల 31న మాదాపూర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్స్‌లోని ఓ ఫ్లాట్‌లో డ్రగ్‌ పార్టీ జరిగింది. సోదాలు నిర్వహించిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్‌ విచారణలో నటుడు నవదీప్‌ పేరు తెరపైకి వచ్చింది. నవదీప్‌కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్‌చంద్‌ తన వాంగ్మూలంలో నవదీప్‌ సైతం తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించాడు. దీంతో టీఎస్‌ నాబ్‌ అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. అయితే ఈ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని నవదీప్ వెల్లడించారు. ఈ మేరకు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయిచారు.

దీంతో సెప్టెంబర్ 19 వరకు నవదీప్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్‌ మోషన్‌ రూపంలో నవదీప్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో నవదీప్‌ వినియోగదారుడిగా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. తాజాగా.. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించటం కలకలం రేపింది. గతంలోనూ టాలీవుడ్ డగ్స్ కేసులో నవదీప్ విచారణ ఎదుర్కొన్నారు.

ANN TOP 10