AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంతిమ యాత్రలో అపశ్రుతి.. మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు

మహిళ అంతిమ యాత్రలో కాల్చిన కాకర్స్ గ్రామంలో రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టాయి. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడగా మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలిపెట్టి బంధువులు వెళ్లిపోయారు. చివరికి పోలీసుల జోక్యంతో అంతిమ యాత్ర సజావుగా సాగింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన వృద్దురాలు నాగేంద్రమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాగేంద్రమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో కాకర్స్ కాల్చారు.

అయితే అలా కాలిన కాకర్స్ గంగాధర్ కు చెందిన వరి గడ్డి వామిపై పడ్డాయి. దీంతో వరి గడ్డి అగ్నికి ఆహూతైంది. గడ్డి వామి తగలబడటంతో నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులతో గంగాధర్ కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య మాటలు దాటి చేతల వరకూ ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలి పెట్టి నాగేంద్రమ్మ బంధువులు వెళ్లిపోయారు.

ANN TOP 10