AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహాగణపతి పూజకు వేళాయె..

పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ మహాగణపతి
ఈసారి 63 అడుగుల విగ్రహం

వినాయకచవితి నేడు (సెప్టెంబరు 18) పర్వదినం. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా నవరాత్రి శోభ వెల్లివిరియనుంది. ఎప్పట్లాగానే హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక్కడ గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఖైరతాబాద్ లో 63 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారు శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టితో తయారుచేశారు. 150 మంది 3 నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు.

ANN TOP 10