AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.60 ల‌క్ష‌ల విలువైన బంగారం స్వాధీనం

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని జ‌ల్పాయిగురిలో ఇద్ద‌రు వ్య‌క్తుల నుంచి రూ.60 ల‌క్ష‌ల విలువ చేసే బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్ట‌రేట్ (డీఆర్ఐ) అధికారులు జ‌ప్తు చేశారు. స‌ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌కు అందిన స‌మాచారం మేర‌కు ప‌నికౌరీ టోల్ ప్లాజా వ‌ద్ద డీఆర్ఐ అధికారులు శుక్ర‌వారం సాయంత్రం త‌నిఖీలు చేశారు. స‌ద‌రు వ్య‌క్తుల నుంచి 51 బంగారం బిస్క‌ట్లు, రూ.2.09 ల‌క్ష‌ల విలువైన 2500 అమెరికా డాల‌ర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను రాకీ బ‌ర్మ‌న్‌, కంచ‌న్ భ‌ట్టాచార్యగా గుర్తించారు. నిందితులిద్ద‌రూ ప‌శ్చిమ బ‌ర్ద‌మాన్ జిల్లా వాసుల‌ని విచార‌ణ‌లో తేలింది. భూటాన్ అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ట్లు నిందితులు చెప్పారు. సిలిగురిలో ఒక వ్య‌క్తిని స‌ద‌రు బంగారం అప్ప‌గించాల్సి ఉంద‌ని నిందితులు చెప్పార‌ని డీఆర్ఐ అధికారులు తెలిపారు.

ANN TOP 10