– సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పార్టీని విలీనం చేస్తూ.. కాంగ్రెస్ లో చేరే తేదీ దాదాపు ఖరారు అయ్యింది. ఇదివరకే షర్మిల..రాహుల్ గాంధీ, సోనియాలతో భేటీ అయిన విషయం విదితమే. ఈ నెల 16, 17 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్‌కు వస్తున్నారు. 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇక 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారీ సభ జరగనుంది. అయితే షర్మిల 15న కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం. 15న సాయంత్రం సోనియా, రాహుల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని కలిసి షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని తెలిసింది.
అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికైతే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయం. ఇక షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే ఆమె స్థానం ఏంటి అనేది క్లారిటీ లేదు. పైగా ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. దీంతో సీటు ఆయనకే దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు షర్మిలకు జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.