AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూడ్రోజుల క్రితం గల్లంతు.. మూసీలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం

కురస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు కాలనీలు జలమయమయయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలను తలపిస్తుండగా.. గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. దీంతో.. మూసారంబాగ్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం పెరిగిపోయింది. బ్రిడ్జిని ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుండటంతో.. మంగళవారం (సెప్టెంబర్ 5) రాత్రి నుంచి 9 గంటల నుంచి మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపేశారు.

తాజాగా.. వరద తగ్గటంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు అనుమతించారు. మూసీ వరద నీటితో బ్రిడ్జిలో పేరుకుపోయిన చెత్తను జీహెచ్‌ఎంసీ కార్మికులు తొలగిస్తున్నారు. బ్రిడ్జి వద్ద చెత్త తొలగిస్తుండగా… ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతయిన లక్ష్మి మృతదేహంగా పోలీసులు గుర్తించారు. వరద నీటి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ కోసం లక్ష్మి కుుటంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మి కూతురు అక్కడకు చేరుకొని చేతిపై ఉన్న పచ్చబొట్టు, ముక్కు పుడక ఆధారంగా తన తల్లి లక్ష్మిగా గుర్తించారు.

మూడు రోజుల క్రితం గల్లంతు..
గాంధీనగర్‌లో నివాసం ఉండే లక్ష్మీ అనే మహిళ నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతయ్యింది. నాలాపై ఆమె ఇల్లు నిర్మించుకుకోగా.. ఇటీవల వర్షానికి ఇంటి గోడ కూలిపోయింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. అయితే ఆమె నాలాలో పడి కొట్టుకుపోయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10