AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జోగురామన్నను ఓడిద్దాం.. అభివృద్ధి సాధిద్దాం

కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
కంది సమక్షంలో జోరుగా చేరికలు
ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరికలు జోరందుకున్నాయి. శ్రీనన్న చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి జనం మేము సైతం నీవెంటే అంటూ కదంతొక్కుతున్నారు. ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ లో చేరుతున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖానాపూర్‌ లో ఇమ్రాన్‌ ఖాన్‌, నజీం ఖాన్‌ ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమానికి కంది శ్రీనివాస రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాణసంచా పేల్చి స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు, కాలనీ వాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఖానాపూర్‌ కు చెందిన ప్రజలు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. జోరు వాన లోనూ చేరికల కార్యక్రమం సక్సెస్‌ ఫుల్‌ గా సాగింది. ఒక వైపు వర్షం పడుతున్నా ఓపికగా కార్యక్రమ పూర్తయ్యేవరకు కాలనీ వాసులు అక్కడినుంచి కదల్లేదు. వారందరికి కంది శ్రీనివాస రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభిమానుల నినాదాలు, కేరింతలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.

ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జనం ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ బంపర్‌ మెజార్టీ తో గెలవడం ఖాయమని అన్నారు. అధికారం అండతో జోగు రామన్న సభకు కరెంట్‌ కట్‌ చేయించారని, కాని జనం నీ పవర్‌ కట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసారు. మైనారిటీలకు లక్ష రూపాయలిస్తానని నాటకమాడారని, బియ్యంకార్డు కూడా ఇవ్వని జోగురామన్న లక్షరూపాయలు ఇస్తడా అని ఎద్దేవా చేసారు. పట్టణంలో డబ్ల్యూ కన్వెన్షన్‌, చాందా వద్ద రూ.100కోట్లతో ఓక్లే స్కూల్‌ ఎలా కట్టావో ప్రజలు అడుగుతున్నారని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసారు. ఈ సొమ్మంతా ఆదిలాబాద్‌ ప్రజలను దోచుకొని సంపాదించిందేనని ఆరోపించారు. ఇలాంటి స్వార్థ పరుడైన ఎమ్మెల్యేను చిత్తుచిత్తుగా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలన్నారు.

మన జోలికొచ్చిన బీఆర్‌ఎస్‌ గూండాల పేర్లు రెడ్‌ డైరీలో రాయండని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రిటర్న్‌ గిఫ్ట్‌ ఇద్దామన్నారు. జోగురామన్నను ఓడిరచడానికి ఎంతమంది సిద్ధం అంటూ కంది శ్రీనివాస రెడ్డి ఇచ్చిన పిలుపునకు జనమంతా చేతులెత్తారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు వెదజల్లి గెలువాలనుకుంటున్న జోగురామన్నకు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. ఆయనిచ్చే డబ్బులు తీసుకొని ఓటు మాత్రం చేతి గుర్తుకు వేయమని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన తర్వాత ప్రజలకు జరిగే లబ్ది గురించి వివరించారు. కాంగ్రెస్‌ కా హాత్‌ గరీబోంకే సాత్‌ అని అన్నారు. నాలుగుసార్లు జోగురామన్నకు అవకాశమిచ్చారని తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. తనకు అందరి ఆశీర్వాదం కావాలని కంది శ్రీనివాస రెడ్డి ప్రజలను అభ్యర్ధించారు.

ANN TOP 10