AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ..

విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి అంటూ వచ్చారు. సమంత హీరోయిన్‌గా చేసింది. భారీ అంచనాలు నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 1న భారీగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ తన ఫ్యామిలీతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ANN TOP 10