AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు ఎంతంటే?

బంగారం ధరలు దూకుడు పెంచాయి. వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా గోల్డ్ రేటు పెరిగింది. గురువారంతో పోల్చితే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 150, అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ రూ. 160 పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెండ్లిళ్ల సీజన్‌ కొనసాగుతుంది. దీంతో కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం దుకాణాలు రద్దీగా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న బంగారం ధరలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజుల్లో 10 గ్రాముల బంగారంపై సుమారు వెయ్యి రూపాయలు వరకు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. శుక్రవారం 22 క్యారెట్ల (10 గ్రాములు) గోల్డ్ ధర 150, అదేవిధంగా 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 160 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ పట్టణం, విజయవాడ ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,150కు చేరగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,160కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు కిలో వెండి ధర రూ. 80,700 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,600 కాగా, చెన్నైలో రూ. 80,700, ముంబైలో రూ. 77,600. అదేవిధంగా. బెంగళూరులో రూ. 76,500, కోల్‌కతాలో రూ. 77,600 గా ఉంది.

ANN TOP 10