AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది : షర్మిల

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొంత కాలంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం వాస్తవ రూపం దాల్చింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీలో షర్మిల కలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యానని చెప్పారు. తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని తెలిపారు.

తెలంగాణ ప్రజల బాగు కోసం వైఎస్సార్ బిడ్డ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే విషయాన్ని అందరితో చెపుతున్నానని అన్నారు. ఢిల్లీ నుంచి ఈరోజే హైదరాబాద్ కు తిరిగి వెళ్తున్నానని తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన ఇతర ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. తర్వాత మాట్లాడదామని, తనను వెళ్లనివ్వండని కోరుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ANN TOP 10