AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెజారిటీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా

హుజూర్ నగర్, కోదాడలో కాంగ్రెస్ పార్టీకి 50 వేల కంటే తక్కువ మెజార్టీ వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “నేను, నా భార్య కోదాడ, హుజూర్ నగరకు మకాం మార్చాం. ఈ సారి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్‌పై ప్రజలకు విపరీతమైన కోపం ఉంది. ఆహాంకారం అనేది బీఆర్ఎస్‌కు పెద్ద శత్రువు అదే వారిని గద్దె దించబోతుంది. అవినీతి విషయంలో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు పర్మిషన్ ఇచ్చినట్లు ఉంది.

టికెట్లు తొందరగా ప్రకటిస్తే మేము ప్రచార వేగం పెంచుతాం. లెఫ్ట్ పార్టీలతో చర్చలు ఏ స్టేజ్ లో ఉన్నాయో తెలియదు. హుజూర్ నగర్ ,కోదాడలో 50 వేల మెజారిటీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా. పార్టీ పోటీ చేయోద్దంటే చేయను. ఎంపీ ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దాం. ఒక్క అంశంపై ఎన్నికలు జరగవు. పార్టీ మ్యానిఫెస్టో, అభ్యర్థుల గుణగణాలు లెక్కలోకి వస్తాయి. గత 6 నెలల్లో పార్టీ చాలా బలపడింది. అంగబలంలో, అర్దబలంలో బీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కుంటాం. ఖమ్మం, నల్లగొండలో క్లీన్ స్విప్ చేస్తాం. నిన్న పీఈసీ సమావేశంలో ఎటువంటి గొడవ జరగలేదు. ఏదో గొడవ జరిగిందనే ప్రచారం అంతా తప్పు.” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ANN TOP 10