తెలంగాణకు తాను తోబుట్టువునని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. రాజ్‌భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘రాఖీ ఫర్ సోల్జర్స్’ అనే పేరుతో సంస్కృతి ఫౌండేషన్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు ఆర్మీ సోల్జర్స్, అధికారులకు గవర్నర్ రాఖీ కట్టారు.










