అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పుతో తెలంగాణలో బీజేపీ పనైపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిసి పోటీచేస్తే బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని దీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రస్తుతం చర్చల దశలో ఉందని, కలిసి పోటీ చేసే పరిస్థితి వస్తే మాత్రం బీఅరెస్ ఓటమి తధ్యమని అన్నారు. ఓట్ల ప్రాతిపదికన కాకుండా ఒకరికి ఒకరు అవసరం అనే అంశంపై పొత్తులపై చర్చ జరపాలన్నారు.
ఇక ఆంధ్రాలో టీడీపీ, కమ్యూనిస్టులు కూటమిగా పోటీ చేస్తే డబుల్ ఇంజన్ సర్కార్ బ్రేక్ అవుతుందన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని అన్నారు. ఎన్నికల కోసమే గ్యాస్ ధర 200 తగ్గించారని, చిత్తశుద్ధి ఉంటే మోదీ హయాంలో రూ.1200లకు పెరిగిన గ్యాస్ ధరను 2014లో ఉన్న ధర కంటే తక్కువకే ఇవ్వాలన్నారు. గ్యాస్ ధరల తగ్గింపు ఆపద మొక్కుల ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు. ఇక ముంబైలో జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి సీపీఐ నుంచి డీ రాజా, బినోయ్ విష్ణోయ్ హాజరవుతారని చెప్పారు.









