AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్మీ ఉద్యోగం రాలేదని దొంగగా మారిన యువకుడు

ఉద్యోగం రాలేదని ఓ యువకుడు దొంగగా మారాడు. విలాసాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. చోరీ సొత్తుతో జల్సాలు చేస్తున్నాడు. నిఘా ఉంచిన కరీంనగర్ పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన తెలగోర్ల గోపాలకృష్ణ ఆర్మీలో ఉద్యోగం సంపాదించటం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఉద్యోగ శిక్షణ నిమిత్తం కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలోని ఓ శిక్షణ కేంద్రంలో కొంత కాలం క్రితం చేరాడు. అయితే ఆర్మీ సెలక్షన్‌లో అతడికి ఉద్యోగం రాలేదు.

దీంతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన యువకుడు సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఫ్లాన్ చేశాడు. అందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడు. ఈ నెల 17న తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి దూరి దొంగతనం చేశాడు. ఇంట్లోని రూ.80 వేల నగదు, తులం బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయాడు. చోరీ సొత్తును గుంటూరుకు తీసుకెళ్లి అక్కడ ఓ బ్యాంకులో వాటిని కుదవ పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బును పూర్తిగా ఖర్చు చేశాడు.

అనంతరం తిరిగి రామకృష్ణకాలనీకి వస్తుండగా సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు నిఘా ఉంచి అతడిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించగా.. గోపాలకృష్ణ అనుమాన్పదంగా కనిపించాడని.. అందుకే అతడిపై నిఘా ఉంచి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. విచారణలో నేరం అంగీకరించటంతో అతడి వద్ద నుంచి సొత్తు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

ANN TOP 10