అమెరికాలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన ఓ ఎన్నారైని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిమ్రన్‌జీత్ సింగ్ కాలిఫోర్నియాలో ఉంటాడు. శనివారం అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకుని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. షాపింగ్ ముగించుకున్నాక వారు పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన తమ కారు వద్దకు వెళ్లారు. అక్కడ వారి మధ్య అకస్మాత్తుగా వాగ్వాదం మొదలైంది. దీంతో, విచక్షణ కోల్పోయిన సిమ్రన్‌జీత్ సింగ్ కారులోని తుపాకీతో గర్ల్‌ఫ్రెండ్‌పై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తరువాత నిందితుడు పారిపోయాడు. మరోవైపు, ఘటన సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్ స్థలంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల ఓ స్టోర్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.









