ఓ పక్క జాతీయ అవార్డు వచ్చిందనే సంబరాలు.. మరోపక్క బ్రహ్మానందంతో బన్నీ స్పెషల్ మీట్.. ఇదంతా యాదృచ్చికంగా జరిగినా ఓ పర్ఫెక్ట్ రీజన్ అయితే ఉంది. బ్రహ్మానందం ఇంటికి వెళ్లి మరీ మీట్ అయ్యారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే వినిపిస్తోంది. ఆయన నేషనల్ అవార్డు గెలుచుకోవడంతో ఒక్కసారిగా బన్నీ నేమ్ మారుమోగుతోంది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ ఎంతో ఖుషీ ఖుషీగా ఉన్నారు. ఈ పరిస్థుతుల నడుమ టాలీవుడ్ కామెడీ దిగ్గజం బ్రహ్మానందంతో బన్నీ మీట్ కావడం హాట్ టాపిక్ అయింది.
బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ వివాహ వేడుక ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆగస్టు 19న ఈ వివాహ వేడుక జరగగా.. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ పెళ్లి వేడుకకు హాజరు కాలేకపోయిన అల్లు అర్జున్.. ఈ రోజు నేరుగా బ్రహ్మి ఇంటికే వెళ్లి కలిశారు. ఆ కుటుంబంతో కాసేపు ముచ్చటించారు. బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడంతో బ్రహ్మి కుటుంబం ప్రత్యేకంగా గజమాలతో సత్కరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.









