జబర్దస్త్ కమెడియన్ నవసందీప్‌ను హైదరాబాద్ మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసాడన్న ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నవసందీప్ 2018 నుంచి ఓ యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఇద్దరికీ వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయం అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఆమెను హైదరాబాద్‌కు రప్పించాడు. నాలుగేళ్లుగా ఆమె షేక్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. అతని మాటలు నమ్మిన యువతి శారీరకంగా దగ్గరైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికి కోరిక తీర్చుకున్నాడు.
ఇటీవల పెళ్లి చేసుకోమని యువతి నిలదీయడంతో ససేమిరా అన్నాడు. తనకి వేరే యువతితో పెళ్లి నిశ్చయమైందని చెప్పాడు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నవసందీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.