AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంగ్రాట్స్ బన్నీ.. సుకుమార్ భావోద్వేగం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరో సాధించలేని అవార్డును తాను గెలుచుకుని.. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా తగ్గేదేలే అని నిరూపించాడు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా.. పుష్ప- ది రైజ్ సినిమాకు గానూ ఉత్తమ జాతీయ నటుడి అవార్డును అల్లు అర్జున్ గెలుచుకున్నాడు. ఈ అవార్జును ప్రకటించగానే.. అల్లు అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ అయితే ఎమోషనల్ అయ్యారు.


బన్నీని గట్టిగా హత్తుకుని చాలా సేపు అలాగే ఉండి పోయారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా బన్నీ ఇంట్లో సందడి చేశారు. ఈ అవార్డు ప్రకటించగానే.. సినీ ప్రముఖుల నుంచి బన్నీకి శుభాకాంక్షలతో పాటు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఐకాన్ స్టార్‌కు కాంగ్రాట్స్ చెప్పేందుకు అబిమానులు ఆయన ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. టపాసులు కాల్చి.. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐకాన్ అల్లు అర్జున్‌ను ఆయన కుటుంబ సభ్యులు నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ అభినందించారు. బన్నీ ఇంటికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలియజేశారు.

ANN TOP 10