AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ మెదక్‌ టూర్‌ రేపే..

ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తొలి తర్వాత తొలిసారి ముఖ్య మంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం సీఎం మెదక్‌ టూర్‌కి సంబంధించిన వివరాలను మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. మెదక్‌ పర్యటనలో భాగంగా కేసీఆర్‌.. వికలాంగులు ఆసరా పెన్షన్ పెంపుతో పాటు టెకేదార్లు, ప్యాకర్స్‌కు పింఛన్లు ఇచ్చే కార్యక్రమంను ప్రారంభించనున్నారు.

బుధవారం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు హరీష్‌ రావు దగ్గరుండి సమీక్షించారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి మెదక్‌కు చేరుకోనున్న సీఎం మెదక్‌లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. హైదరాబాద్‌ నుంచి నర్సాపూర్‌ మీదుగా రోడ్డు మార్గంలో సీఎం మెదక్‌కు చేరుకోనున్నారు. గుమ్మడిదలలో సీఎంకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఘన స్వాగతం పలకనున్నారు.

మెదక్‌ నుంచి ప్రగతి శంఖారావం: హరీష్‌ రావు
బుధవారం మెదక్‌ నుంచి సీఎం కేసీఆర్‌ ప్రగతి శంఖారావాన్ని పూరిస్తారని తెలిపారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10కి పది స్థానాలు గెలిచి, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. అభ్యర్థుల ప్రకటన తమ గెలుపునకు, ధీమాకు నిదర్శనమన్నారు హరీష్‌. కేసీఆర్‌ వ్యూహం ఎవరూ ఊహించలేదని, విపక్షాలు ఆగమైపోయాయని హరీష్‌ వ్యాఖ్యానించారు.

ANN TOP 10