AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ ఎక్కడా గెలవరు – షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ తీవ్రంగా స్పందించారు. ‘సీఎం కేసీఆర్‌.. గజ్వేల్‌ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తారని తెలిసింది. చరిత్రలో మరో పొరపాటు చేస్తున్నారు కేసీఆర్‌. కామారెడ్డి గడ్డపై పుట్టిన వ్యక్తిని నేను. కామారెడ్డి ప్రజలపై నాకు విశ్వాసం ఉంది. కేసీఆర్‌ ను ఓడిస్తారు. ముస్లిం, మైనార్టీ లీడర్‌ అని చూసి నాపై పోటీ చేయాలని చూస్తున్నారు. కేసీఆర్‌.. ఇక్కడ అక్కడ.. ఎక్కడా గెలవరు. కేసీఆర్‌ ను ఓడగొట్టి ఇంటికి పంపడం ఖాయమన్నారు. కామారెడ్డి అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ చేసిందేమి లేదన్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మైనార్టీ డిక్లరేషన్‌ కమిటీ వేశారని, ఆ కమిటీకి చైర్మన్‌ గా నన్ను వేశారని తెలిపారు. ఇవ్వాళ కమిటీ సభ్యులతో డిక్లరేషన్‌ పై చర్చించాం షబ్బీర్‌ అలీ తెలిపారు.

ANN TOP 10