AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నన్ను డ్యామేజ్ చేస్తే పార్టీకే నష్టం- జగ్గారెడ్డి సీరియస్ వార్నింగ్

పార్టీ మార్పు వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మారడం లేదని మీడియా సమావేశంలో నేను స్పష్టంగా చెప్పినప్పటికీ కొంతమంది గుసగుసలు పెడుతున్నారని జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. ‘‘ఇప్పటికే అనుమానం క్లియర్ చేశాను. మళ్ళీ ఇంకో అనుమానం అంటే ఎలా? అనుమానించే వారికీ పనేమీ లేదా? 41 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. నేను కష్టపడి రాజకీయాల్లో ఉన్నా. కొంతమంది ఇప్పటికైనా గుసగుసలు బంద్ చేయాలి. అప్పు చేసి 3సార్లు ఎమ్మెల్యే అయ్యా. ఏమీ సంపాదించుకోలేదు. నా మీద నిరాధార ఆరోపణలు చేస్తే పీసీసీకి, సీఎల్పీకి ఫిర్యాదు చేస్తా. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు పెట్టిస్తా. పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. పరువు నష్టం దావా వేస్తా” అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ” నేను 90శాతం అహింసావాదిని. 10శాతం భగత్ సింగ్ లా వేరే పాత్ర పోషిస్తా. నేను పూర్తిగా పబ్లిక్ మనిషిని. ఇప్పటికీ నాకు సొంతిల్లు కూడా లేదు. నాకు ఆస్తులు ఉన్నాయని ఒక్కటి నిరూపించండి. అది వారికే ఇచ్చేస్తా. ధరణిలో ఒక్క ఎకరా భూమి ఉన్నట్లు చూపితే వారికే ఇస్తా.

నాపై సొంత పార్టీ వాళ్లు కాదు బయటి వ్యక్తులు చెడు ప్రచారం చేస్తున్నారు. జగ్గారెడ్డి అంటే వ్యక్తి కాదు. కాంగ్రెస్ లీడర్. నన్ను డ్యామేజ్ చేస్తే పార్టీకే నష్టం. మచ్చలేని నాపై లేనిపోని ప్రచారం చేస్తున్నారు. అందుకే.. పీసీసీ చీఫ్ తో కలిసి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిస్తా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం చట్టం చేయాలని కోరతా” అని జగ్గారెడ్డి చెప్పారు.

ANN TOP 10