AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టైరు పేలి పొలంలోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు.. ఇద్దరు మృతి

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాజం జరిగింది. వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం స్టేజి వద్ద ఓ ప్రైవేటు బస్సు టైర్ రన్నింగ్‌లో పేలింది. మిర్యాలగూడెం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపుతప్పిన బస్సు.. రహదారిపై వెళ్తున్న ఓ బైకును ఢీకొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా.. అతడిని మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పంట పొలం బురదలో బస్సు కూరుకుపోగా.. ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం బస్సును కూడా క్రేన్ సాయంతో బయటకు తీశారు. ప్రమాదంలో మృతి చెందిన వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ANN TOP 10