AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హరీశ్‌రావును బట్టలిప్పి నిలబెడతా… బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. మెదక్‌లో ప్రచారం చేయడానికి హరీశ్ రావు ఎవరు? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్‌గిరి నుంచి నేను, మెదక్ నుంచి నా కుమారుడు రోహిత్ చేస్తామని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే సిద్దిపేటలో నా తడాఖా చూపిస్తా, హరీశ్‌రావును బట్టలిప్పి నిలబెడతా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘హరీశ్ రావు గతం గుర్తుంచుకోవాలి.. తన నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం చేస్తున్నాడు.. హరీశ్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోను.. అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడు.. సిద్దిపేటలో హరీశ్ రావు అడ్రస్స్ గల్లంతు చేస్తా.. రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడు.. మెదక్‌లో నా తనయుడిని కచ్చితంగా గెలిపించుకుంటా..’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ANN TOP 10