AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

25న కాచిగూడ-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

కాచిగూడ-బెంగళూరులను కలిపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. ఈనెల 25వ తేదీన ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలుతో హైదరాబాద్‌బెంగళూరు మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్ టు- బెంగళూరులోని యశ్వంతపూర్ రైల్వేస్టేషన్‌ల మధ్య నడుస్తుందని అధికారులు తెలిపారు. కాచిగూడయశ్వంత్‌పూర్ రూట్‌లో ప్రయాణించే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు కర్నూల్ మీదుగా ప్రయాణిస్తుంది. తొలుత రాయచూర్ మార్గంలో నడపాలని అధికారులు భావించినా ప్రస్తుతం దానిని కర్నూల్ మీదుగా నడపాలని నిర్ణయించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10