టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా కంపెనీ తక్కువ ధరకే విమాన టికెట్లు అందిస్తోంది. మీరు ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలనే ఆలోచనలో ఉంటే వెంటనే ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ప్రత్యేకంగా 96 గంటల సేల్ నిర్వహిస్తోంది. ఆగస్ట్ 17 నుంచి అంటే ఇవాళ్టి నుంచే ఈ స్పెషల్ సేల్ ప్రారంభమైంది. నేటి నుంచే ఈ డిస్కౌంట్ ఆఫర్ టికెట్ ధరల సేల్ లభిస్తోంది. ఇందులో భాగంగా మీరు దేశీయ విమాన ప్రయాణం, ఇంటర్నేషనల్ విమాన ప్రయాణం రెండింటి పైనా డిస్కౌంట్ పొందవచ్చు.
రూ.1,470కే విమాట టికెట్..
ఎయిరిండియా 96 హవర్ సేల్‌లో భాగంగా మీరు రూ. 1470 ప్రారంభం ధరకే విమాన టికెట్ పొందొచ్చు. దేశీయ విమాన ప్రయాణానికి ఈ రేటు వర్తిస్తుంది. వన్ వే ఎకానమీ క్లాస్ ప్రయాణానికి ఈ రేటు ఉంటుంది. అదే మీరు బిజినెస్ క్లాస్ ప్రయాణానికి అయితే రూ. 10,130 నుంచి ధర ప్రారంభం అవుతోంది. ఎయిరిండియా వెబ్‌సైట్, కంపెనీ యాప్ ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకోవడం వల్ల ఈ తగ్గింపు ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఆఫర్‌లో టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా కన్వీనియన్స్ ఫీజు కూడా ఉండదు. అంతేకాకుండా ఎయిరిండియలోనే రిటర్న్ జర్నీ చేస్తే.. అప్పుడు ప్రయాణికులకు డబుల్ లాయల్టీ బోనస్ పాయింట్లు కూడా లభిస్తాయి. అన్ని రకాల టికెట్లకు ఈ లాయల్టీ బోనస్ వర్తిస్తుంది.
ఎయిరిండియా 96 హవర్ సేల్ ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేయొచ్చు. ఈ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ సేల్ ఆగస్టు 17 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటే.. వారికే డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది.