శ్రావణ మాసం వచ్చేసింది. పెండ్లిలు.. వ్రతాలు వంటివి కామన్. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. అయితే ఇవాళ బంగారం ధర తగ్గింది. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గినా కూడా తులంపై రూ.100 లేదంటే రూ.150 తగ్గేది. కానీ నేడు ఏకంగా రూ.380 తగ్గింది. ఇక వెండి కిలోపై రూ.500 మేర తగ్గింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.350 మేర తగ్గి రూ.54,100కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.380 మేర తగ్గి రూ.59,020కి చేరింది.
