AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహేష్ బాబు ఇంటి నుంచి విషాదకర వార్త.. సితార, నమ్రత ఎమోషనల్

స్టార్స్ ఇంట్లో పెట్స్‌కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనందరికీ తెలుసు. చాలా మంది నటీనటులు తమ తమ ఇంట్లో పెట్స్‌ని పెంచుకుంటూ ఎంతో ప్రేమగా ఉంటారు. ఆ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఉంటుంది. అయితే మహేష్ ఫ్యామిలీ ఎంతో ప్రేమగా పెంచుకున్న ప్లూటో అనే పెట్ మృతి చెందడంతో ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్, కూతురు సితార ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్లూటో పిక్ షేర్ చేస్తూ తమ బాధను వ్యక్త పరిచారు.

ఏడేళ్ల బంధం అంటూ.. మిస్ యూ అంటూ ప్లూటో పిక్ షేర్ చేసింది మహేష్ డాటర్ సితార. ఈ పెట్ పట్ల సితార చాలా ప్రేమగా ఉండేదట. ప్లూటో గురించి గతంలోనూ పోస్టులు చేసింది సితార. ప్లూటో బర్త్ డే సందర్భంగా.. అదే నా ప్రపంచం, నా సంతోషం అన్నట్టుగా పోస్టులు పెట్టింది. అయితే ఇప్పుడు ప్లూటో దూరం కావడంతో సితార చాలా బాధ పడుతూ తన సందేశాన్ని పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసి సితార తల్లి నమ్రత కాస్త ఓదార్చే ప్రయత్నం చేసింది.

ప్లూటో ఎక్కడికి వెళ్లదు.. మనతోనే ఉంటుంది.. మన ప్రేయర్స్‌లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని తెలుపుతూ సితార పోస్ట్‌పై రియాక్ట్ అయింది నమ్రత.

ANN TOP 10