పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా నా సహకారం ఉంటుంది.. మాకు కావాల్సింది కేసీఆర్ ప్రభుత్వమే అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుత్తా మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమయం, సందర్భం లేకుండా తనపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. టెండర్ల ద్వారానే గంధమల్ల రిజర్వాయర్ పనులు వచ్చాయని, భూసేకరణ వల్ల పనుల్లో ఆలస్యం ఏర్పడిందన్నారు. నిజాంకాలం నాటి నుండే ఉన్న కాంట్రాక్టర్లను గుత్తా సుఖేందర్ రెడ్డికి అపాదించడం సరికాదన్నారు. ఏ పదవీ వద్దంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సన్యాసం తీసుకుంటే మంచిది, ఇదే సరైన సమయం అంటూ ఎద్దేవా చేశారు. రెండు లక్షల రుణమాఫీ అసాధ్యంమైందే ప్రజలు అలోచించాలన్నారు. ప్రజలను మోసం చేసేలా జాతీయ పార్టీలు వ్యవహరించొద్దని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడు ఒకటంటే మరొకరు ఒకటంటారని… వీరు అధికారంలోకి ఎలా వస్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు.









