తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడాన వానలు పడే అవకాశముంది.. తెలంగాణకు ఎల్లో అలెర్టు కూడా జారీ చేసింది. అలాగే రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉందట.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అటు ఏపీలోను ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాల్లో వానలు పడొచ్చని అంచనా వేసింది.









