నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కేశవ్, గంగామణి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కేశవ్ దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అయితే సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్న కుమార్తె వేదశ్రీ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్లో పడిపోయింది. బకెట్ నిండా నీరు ఉండటంతో అందులో మునిగింది. చిన్నారి బకెట్లో పడటాన్ని ఆలస్యంగా గమనించిన కుటుబంసభ్యులు.. వెంటనే కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం బోధన్ హాస్పిటల్కు సిఫార్సు చేశారు. అక్కడికి తీసుకెళ్లగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వెల్లడించారు. దీంతో చిన్నారి కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. తల్లీదండ్రులు రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.