AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ..

ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో మయన్మార్‌, బంగ్లాదేశ్‌పైన మేఘాలు ఆవరించి ఉన్నాయని, ఆదివారం తెలుగు రాష్ట్రాల కదులుతున్నాయని చెప్పింది.

వాటితో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. నల్లగొండ, హైదరాబాద్‌, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శనివారం సాయంత్రం రాష్ట్రంలోని పలు చోట్ల వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా ఘన్‌పూర్‌లో 71 మిల్లీ మీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో 53 మిల్లీ మీటర్లు, ఖమ్మం జిల్లా లింగాలలో 43 మిల్లీ మీటర్లు, రావినూతల, తిమ్మారావుపేటలలో 42, మధిరలో 39, రంగారెడ్డి జిల్లా బోడకొండలో 39 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైందని చెప్పింది.

ANN TOP 10