AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విచ్చలవిడిగా భూములు అమ్మేస్తుండ్రు

తెలంగాణలో ఉన్న భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మేస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వలిగొండలో ఎంపీ కోమటిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తాగుడు మీదే 50వేల కోట్లు వస్తున్నాయన్నారు. కొత్తగా లిక్కర్ టెండర్లకు దరాఖాస్తులు పిలిచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది.. ఏ సర్వే చూసినా కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతోందన్నారు. వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. గ్రూప్-2 పరీక్ష పోస్ట్ పోన్ చేయమంటే చేయడం లేదన్నారు. భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ని గెలిపించాలని కోరారు. మరోసారి సబ్‌స్టేషన్ దగ్గర ధర్నాకు దిగుతా.. దెబ్బకు కేసీఆర్ దిగి రావాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం ఎవరైనా మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ పైనే చేస్తాం, 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈనెల 16, 17వ తేదీల తర్వాత బస్సు యాత్ర మొదలుపెడతాం, తెలంగాణ అంతా కాంగ్రెస్ నేతలు పర్యటిస్తారని అన్నారు.

ANN TOP 10