AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ను ఇంటికి పంపడమే లక్ష్యం

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని ఇంటికి పంపడమే కాంగ్రెస్‌ లక్ష్యమని, అదే ఆశయంతో పార్టీ శ్రేణులంతా పని చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. మాయమాటలు చెప్పి అధికా రంలోకి వచ్చి ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసగించిన సీఎం కేసీఆర్‌ను గద్దె దించడడమే కాంగ్రెస్‌ ఆశయమని చెప్పారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అర్బన్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద నివాళుర్పించి ర్యాలీగా నందన గార్డెన్స్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా అర్బన్‌ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రజల మనోభావాలకనుగుణంగా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను రాష్ట్రంలో గెలిపించి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలన్నారు అదే విధంగా రాహుల్‌గాంధీని దేశ ప్రధా నిగా చేయడయే లక్ష్యంగా పని చేయాలని కోరారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లె కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని, ఆవిషయాన్ని మరిస్తే ఎలా అని ప్రశ్నించారు.

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ఉన్న బీఆర్‌ఎస్‌ దొందు దొందేనని.. బీజేపీ కొట్టినట్లు బీఆర్‌ఎస్‌ ఏడ్చినట్లు నటిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఒక్కరే కొట్లాడితే తెలంగాణ వచ్చిందా అని నిలదీశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉందని గుర్తించిన సీఎం కేసీఆర్‌ కొత్త పథకాలను తీసుకువస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని చెప్పారు. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో గుర్తుకురాని రైతు రుణమాఫీ హఠాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చిందో సీఎం చెప్పాలని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ లకు రూ.5లక్షలు వెచ్చించి కట్టిస్తానన్న సీఎం ఇప్పుడు రూ.3 లక్షలతో ఇల్లు కట్టిస్తానని కొత్తనాటకానికి తెరలేపారని మండి పడ్డారు. వైన్‌షాపుల దరఖాస్తులకు మూడు నెలలు ముందు నుంచి తీసుకుంటున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాని కి మాత్రం మూడు రోజులు గడువు పెట్టారని ధ్వజమొత్తారు. విభజన హామీలో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం బీఆర్‌ఎస్‌ ఏనాడైనా దీక్షలు చేసిందా అన్నారు. పోడు భూముల పట్టాల కోసం 13 లక్షల ఎకరాలకు దరఖాస్తులు చేసుకుంటే కేవలం 4.25 లక్షల ఎకరాలకు పట్టాలిచ్చి చేతులు దులుపుకు న్నారని విమర్శించారు.

ANN TOP 10