ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు..
466 అంబులెన్స్‌లు ప్రారంభం
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 466 వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వెహికిల్స్ ఉన్నాయి.
