మహారాష్ట్రపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అక్కడ తమ పార్టీ కార్యకలాపాలను పెంచుకుంటున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మహారాష్ట్రలో పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రగతి భవన్ నుంచి నేరుగా.. నేరుగా ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. కొల్లాపూర్ విమానాశ్రయానికి 11.15 గంటలకు చేరుకుంటారు. విమనాశ్రయం నుంచి నేరుగా కొల్లాపూర్‌లోని అంబాబాయి దేవాలయానికి చేరుకుంటున్నారు. ఆలయంలో అమ్మవారికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
సాయంత్రం ఐదు గంటలకు కొల్లాపూర్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అన్నాభావు సాఠే మహారాష్ట్రలో పలు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సాఠే వర్దంతి కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.









