AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కిషన్‌రెడ్డితో జయసుధ భేటీ.. బీజేపీలో చేరేందుకేనా?

ప్రముఖ సినీ నటి జయసుధ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది. జయసుధ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ విషయంలో పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. 2009లో కాంగ్రెస్‌ నుంచి సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. అయితే గతంలో కూడా జయసుధ బీజేపీలో చేరుతారంటూ హడావుడి నడిచింది ఆ తరువాత ఏమైందో ఏమో కానీ అంతా సైలెంట్‌ అయిపోయింది.

గతంలో కూడా జయసుధ, ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సినీ నిర్మాతతో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు మంతనాలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు వివరించాయి. కాగా, బీజేపీలో చేరాలన్న ఆ పార్టీ నేతల ప్రతిపాదనపై అప్పట్లో జయసుధ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని కమలం వర్గాలు పేర్కొన్నాయి. తనకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి విస్పష్ట హామీ ఇవ్వాలని ఆమె కోరినట్లు అప్పట్లో టాక్‌ నడిచింది.

ANN TOP 10