హైదరాబాద్ నగరంలోని ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. వారం పాటు 22 ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ అధికారులు వెల్లడించారు. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతుల నేపథ్యంలో ట్రైన్లు క్యాన్సిల్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకు.. సంబంధిత రైళ్ల రద్దు ఉంటుందని పేర్కొంది. వాటిల్లో లింగంపల్లి-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 12 ఎంఎంటీఎస్ ట్రైన్లు ఉన్నాయి. ఉందానగర్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య నడిచే మరో 10 ఎంఎంటీఎస్‌లు కూడా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి సూచించింది.









